సైసైదాబాద్, సింగరేణి కాలనీలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆరేళ్ళ చిన్నారిపై హత్యాచారం చేసిన ఆ కౄరుడిని వదలొద్దు అంటూ సెలెబ్రిటీల నుంచి సామాన్యుల దాకా అందరూ ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. తాజాగా చిరంజీవి ఈ విషయంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. “అభం శుభం తెలియని ఆరేళ్ళ చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కిరాతకుడు రాజు తనను తానే శిక్షించుకోవడం బాధిత కుటుంబంతో పాటు కొంతమందికి ఊరటను కలిగిస్తోంది. ఈ సంఘటనపై మీడియా, పౌర సమాజం స్పందించిన తీరు గొప్పగా ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వంతో పాటు పౌర సమాజం కూడా చొరవ చూపాలి. అటువంటి కార్యక్రమానికి ఎవరు చేపట్టినా వారికి నా సపోర్ట్ ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి” అంటూ చిరు ట్వీట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement