Thursday, November 21, 2024

జగన్ నిర్ణయం సముచితం.. చిరంజీవి హర్షం

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో విమానాశ్రయానికి తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరిట సీఎం జగన్ నామకరణం చిసిన సంగతి తెలిసిందే. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్టు సీఎం జగన్ ప్రకటించడంతో తన హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయిందని తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెల్లదొరలపై పోరాట బావుటా ఎగురవేసిన మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడని చిరంజీవి గుర్తు చేశారు. ఉయ్యాలవాడ అత్యంత గొప్ప దేశభక్తుడని తెలిపారు. అలాంటి వీరుడి పేరు ఎయిర్ పోర్టుకు పేరుపెట్టడం అత్యంత సముచిత నిర్ణయమని కొనియాడారు. అంతటి యోధుడి పాత్రను తెరపై తాను పోషించడం తనకు దక్కిన అదృష్టంగా, గౌరవంగా భావిస్తానని చిరంజీవి పేర్కొన్నారు. ఈ మేరకు చిరు ట్వీట్ చేశారు.

కాగా, ఉయ్యాలవాడ జీవితకథతో వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను చూసి అప్పట్లో సీఎం జగన్.. చిరంజీవి నటనను మెచ్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement