టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేష్ లో వచ్చిన మూవీ ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ నిన్న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడులైంది. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆచార్య పాత్రలో చిరంజీవి నటించిగా, సిద్ద పాత్రలో రామ్‌చరణ్ నటించాడు. మ్యాట్నీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చరణ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
ఈ చిత్రం మొదటి షో నుంచే నెగిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ చిత్రం కొరటాల మార్క్ ఎక్కడా కనిపించ లేదని ప్రేక్షకుల అభిప్రాయం. కథ భాగానే ఉన్న కథనం కొత్తగా లేదని, కొరటాల డైలాగ్స్, ఎలివేషన్స్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఈ చిత్రం కలెక్షన్స్ కూడా డ్రాప్ అయినట్లు ట్రెడ్ వర్గాల సమాచారం. విడుదల అయ్యి రెండు రోజులు కూడా కాకుండానే ఆచార్య సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతుందంటూ ప్రచారం జరుగుతోంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమేజాన్ ప్రైమ్ ఆచార్య డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా విడుదలైన మూడు వారాల తర్వాత ఆచార్య డిజిటల్‌లో విడుదల కావాలి. ఈ క్రమంలో మే చివరి వారంలోపు ఆచార్య డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ తెలుస్తోంది.