ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు 1,035 కుండ శ్రీ లక్ష్మీ నారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ట కుంభాభిషేకం నిర్వహించనున్నారు. స్వర్ణమయ శ్రీ రామానుజ విగ్రహ ప్రతిష్ట చేయనున్నారు. ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ జరగనుంది. ఫిబ్రవరి 14న పూర్ణాహుతిలో రాష్ట్రపతి రామ్‌నాథ్ పాల్గొనబోతున్నారు.
ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను ఈరోజు చినజీయర్ స్వామి కలిశారు. భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు శంషాబాద్ ముచ్చింతల్‌లోని ఆధ్మాత్మిక కేంద్రం సిద్ధమవుతోంది. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్‌ను భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించారు. హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ నివాసానికి వెళ్లిన చిన్నజీయర్ స్వామి… ఆహ్వాన పత్రికను అందించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను కూడా ఉత్సవాలకు చిన్నజీయర్ స్వామి ఆహ్వానించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..