Sunday, November 24, 2024

పని చేయని చైనా వ్యాక్సిన్.. వియాన్ న్యూస్ సంచలన కథనం

కరోనా నియంత్రణ కోసం చైనా తయారు చేసిన వ్యాక్సిన్ తో ఉపయోగమేలేదని వియాన్ న్యూస్ ఓ సంచలన కథనం వెలువరించింది. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టామంటూ ఊదరగొట్టి.. పనికిరాని వ్యాక్సిన్ ను ప్రజలకు అంటగట్టిందని వివరించింది. విదేశీ వ్యాక్సిన్లను నిరాకరించి, తమ దేశంలోనే తయారైన పనికిమాలిన వ్యాక్సిన్లు వేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని విమర్శలు గుప్పించింది. చైనా పంపిన కరోనా వ్యాక్సిన్ తో ఎలాంటి ఉపయోగం ఉండదని పేద దేశాలు చాలా రోజుల క్రితమే గుర్తించాయని పేర్కొంది. 2020 నవంబర్ లో కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టామని చైనా అధినేత షీ జిన్ పింగ్ ప్రకటించారు.

ఆపై ప్రపంచ దేశాలకు 180 కోట్ల డోసులను అందజేశారు. అందులో 32.8 కోట్ల డోసులను ప్రపంచంలోని పేద దేశాలకు ఉచితంగా అందించినట్లు చైనా పేర్కొంది. ఆయా దేశాలు మాత్రం చైనా వ్యాక్సిన్ ప్రభావంపై పెదవి విరిచాయి. కరోనాను కంట్రోల్ చేయడంలో వ్యాక్సిన్ ఎలాంటి ప్రభావం చూపట్లేదని బహిరంగంగానే వెల్లడించాయి. చైనా వ్యాక్సిన్ పై నమ్మకంతో పాకిస్థాన్ మిగతా వ్యాక్సిన్లను కొనుగోలు చేయలేదు.. దీంతో దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. పాకిస్థాన్ తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌, బ్రెజిల్‌, ఇండోనేసియా, తుర్కియే.. ఇలా పలుదేశాలు చైనా వ్యాక్సిన్‌ పనికిరానిదేనని గతంలోనే తేల్చేశాయి. తాజాగా చైనా వ్యాక్సిన్లను అందుకున్న కాంబోడియా.. వాటిని వాడాలా వద్దా అనే సందిగ్ధంలో పడిందని వియాన్‌ న్యూస్ కథనం వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement