ప్రపంచ జనాభాని భయపెట్టించిన చైనా లాంగ్ మార్చ్ రాకెట్ (సీజెడ్-5బీ) పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది. దీని శకలాలను మెక్సికన్ తీరంలో గుర్తించారు. ఈ రాకెట్ తొలుత స్పెయిన్ పై కూలిపోతుందని భావించినా, అదృష్టవశాత్తు పసిఫిక్ జలాల్లో పడిపోయింది. దాంతో ప్రాణనష్టం తప్పినట్టయింది. చైనా రాకెట్లు ఇలా భయాందోళనలు కలిగించే రీతిలో భూవాతావరణంలోకి రావడం రెండేళ్లలో ఇది నాలుగోసారి. చైనా రాకెట్ కూలిపోయిన విషయాన్ని అమెరికా స్పేస్ కమాండ్ నిర్ధారించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement