కేవలం మూడు గంటల 28నిమిషాల్లో 42కిలో మీటర్లు పరిగెత్తాడు చైనాకు చెందిన ఓ వ్యక్తి.ఇక్కడ విశేషం ఏంటంటే దారి పొడవునా సిగరెట్లను ఆపకుండా కాల్చుతూనే పరిగెత్తడం విశేషం. ఈ నెల 6న షాంఘైలో ఈ పోటీ నిర్వహించినట్టు ది ఇండిపెండెంట్ పత్రిక పేర్కొంది. నిజానికి పొగతాగడం పరుగెత్తడానికి అవరోధం అని భావిస్తుంటారు. కానీ, షాంగ్జూకు చెందిన అంకుల్ చెన్ అనే ఈ చైన్ స్మోకర్ పొగతాగడమే తన బలమని నిరూపించాడు. మొత్తం 1500 మంది ఈ పోటీలో పాల్గొనగా చెన్ 574వ స్థానంలో నిలిచాడు. ఒక 50 ఏళ్ల వ్యక్తి ఈ ఘనత సాధించడం నిజంగా రికార్డు. అయితే అంకుల్ చెన్ కు సిగరెట్ తాగుతూ పరుగు పందేల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి కాదు. 2018, 2019లోనూ ఇదే మాదిరి పోటీల్లో పాల్గొన్నాడు. తాజా ఫీట్ పై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పొగతాగుతూ పరుగెత్తడం అసాధ్యమేనంటూ చెన్ ను ప్రశంసిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement