Friday, November 22, 2024

తైవాన్ వైపు దూసుకొచ్చిన చైనా ఫైట‌ర్ జెట్స్‌.. అల‌ర్ట్ ప్ర‌క‌టించిన తైవాన్‌

ఓ వైపు ర‌ష్యా- ఉక్రెయిన్ యుద్ధం న‌డుస్తుండగానే.. చైనా మ‌రో సంచ‌ల‌నానికి తెరలేపింది. తైవాన్ వైపు యుద్ధ విమానాల‌ను పంపింది. అయితే ఇరుదేశాల మ‌ధ్య వివాదం కొత్తేమీ కాదంటున్నారు ప‌రిశీల‌కులు.. గతంలోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగాయంటున్నారు. అయితే స‌రిగ్గా ర‌ష్యా- ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతున్న స‌మ‌యంలోనే అటు చైనా కూడా తైవాన్ వైపు యుద్ధ విమానాల‌ను పంపిన నేప‌థ్యంలోనే మ‌ళ్లీ ఈ చ‌ర్చ వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఒక్క నెల‌లోనే 12 చైనా విమానాలు తైవాన్ వైపు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా 9 చైనా యుద్ధ విమానాలు మ‌ళ్లీ తైవాన్ వైపు వెళ్ల‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం అంటున్నారు అన‌లిస్టులు..

అయితే.. తైవాన్ కూడా అటు వైపు త‌మ యుద్ధ విమానాల‌ను పంపింది. ప్ర‌జ‌లంద‌రూ అత్యంత అప్ర‌మ‌త్త‌త‌తోనే ఉండాల‌ని తైవాన్ ప్ర‌భుత్వం రేడియోల ద్వారా ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించింది. అడిజ్ ప్రాంతంలో చైనా యుద్ధ విమానాలు క‌నిపించాయ‌ని తైవాన్ ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. తైవాన్ గ‌గ‌న ప్రాంతంలోకి ఇత‌ర దేశాల విమానాలు ప్ర‌వేశించే స‌మ‌యంలో తైవాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల‌ర్స్‌కు స‌మాచారం అందించాల్సి ఉంటుంది. చైనా ఈ ప‌నులేవీ చేయ‌లేద‌ని తైవాన్ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement