కరోనాకు పుట్టినిల్లయిన చైనాలో మళ్లీ మహమ్మారి విజృభిస్తోంది. గత కొద్ది రోజులుగా భారీగా కేసులు పెరుగుతున్నాయి. రెండేండ్ల గరిష్ఠ స్థాయికి కేసులు పెరిగాయి. దీంతో అక్కడి ప్రభుత్వం మళ్లీ ఆంక్షలను కఠినతరం చేసింది. ఇప్పటికే పలు నగరాల్లో లాక్డౌన్ విధించింది. హాంకాంగ్‌లోనూ వైరస్ విజృంభిస్తున్నది. నగరంలో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనతో నగరాన్ని వీడుతున్నారు.
ఒమిక్రాన్ ఉప వేరియంట్ అయిన ‘స్టెల్త్ ఒమిక్రాన్’గా పిలుస్తున్న ‘బి.ఎ.2’ కారణంగా పలు నగరాలు క్రమంగా లాక్డౌన్ గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయి. మంగళవారం చైనా తాజా కోవిడ్ కేసులు అంతకుముందు రోజు కంటే రెండు రెట్లు ఎక్కువ. తాజా 24 గంటల వ్యవధిలో స్థానికంగా 3,507 కొత్త కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది, ఇది ఒక రోజు ముందు 1,337గా ఉంది. “స్టెల్త్ ఓమిక్రాన్” అని పిలువబడే వేగంగా వ్యాప్తి చెందుతున్న వేరియంట్ చైనా యొక్క జీరో-టాలరెన్స్ స్ట్రాటజీని పరీక్షిస్తోంది. కొత్త కేసులు చాలా వరకు ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లో ఉన్నాయి. ఇక్కడ 2,601 నమోదయ్యాయి. ప్రధాన నగరాలైన బీజింగ్, షాంఘై, షెన్జెన్లతో పలు నగరాల్లో వ్యాప్తి అధికంగా ఉంది.