Friday, November 22, 2024

చంద్రుడిపై నీటి జాడలు.. చేంజ్‌-5 డేటాలో కీలక ఆధారాలు

చంద్రుడిపై నీటి ఆనవాళ్ల కోసం కొన్ని దశాబ్దాలుగా అన్వేషణలు కొనసాగుతున్నాయి. తాజాగా చైనా ప్రయోగించిన చేంజ్‌-5 ల్యాండర్‌ ఈ దిశగా కీలక రుజువులను సేకరించింది. చంద్రుడిపై నీటికి సంబంధించి మొట్ట మొదటి ఆధారాన్ని అందించింది. చంద్రుడిపై పరిశోధన కేంద్రాలను నిర్మించడంతోపాటు, అంగారకుడిపైకి వలస వెళ్లేందుకు మానవాళి చేస్తున్న ప్రయత్నాలకు చంద్రుడిపై నీటి వనరుల తాజా ఆవిష్కరణ గొప్ప పురోగతి అని ఖగోళ శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌కు చెందిన లిన్‌ యాంగ్టింగ్‌, లిన్‌ హాంగ్లీ నేతృత్వంలోని సంయుక్త పరిశోధన బృందం చేంజ్‌-5 ల్యాండర్‌ ద్వారా సేకరించిన చంద్రుడి ఉపరితల నీటి అణువుల డేటాలను పరిశీలించింది. అమెరికన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ నిర్వహిస్తున్న మల్టిడిసిప్లినరీ ఓపెన్‌ యాక్సెస్‌ సైంటిఫిక్‌ జర్నల్‌ అయిన సైన్‌ అడ్వాన్సెస్‌లో ఇందుకు సంబంధించిన నివేదిక ప్రచురితమైంది.

చంద్రుడిపై నీరు ఎక్కువగా సోలార్‌ విండ్‌ ఇంప్లాంటేషన్‌కు కారణమని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనికి ముందు గత దశాబ్దంలో పూర్తిచేసిన అనేక పరిశీలనలు, నమూనాలు చంద్రుడిపై నీటి ఉనికిని కనుగొన్నాయి. అయినప్పటికీ ఉపరితలంపై ఇంతకు ముందు ఎటువంటి ఇన్‌ సిటు కొలతలు నిర్వహించబడలేదు. చేంజ్‌-5 ఈ వెలితిని భర్తీచేసింది. చంద్రుడిపై నీటి జాడలు మానవ మనుగడకు, రాకెట్‌ వంటి అంతరిక్ష నౌకల ఇంధనం ఉత్పత్తికి దోహదపడుతుందని అంతరిక్ష విశ్లేషకుడు సాంగ్‌ జోంగ్‌పింగ్‌ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement