Monday, November 18, 2024

ఇకపై ముగ్గురు పిల్లల్ని కనవచ్చు..

చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో దారుణంగా పడిపోతున్న జననాల రేటును తిరిగి పెంచేందుకు చైనా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. చైనా పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇకపై ప్రతి ఒక్కరు ముగ్గురు పిల్లల్ని కనేందుకు అధికార కమ్యూనిస్ట్ పార్టీ తీసుకొచ్చిన ప్రతిపాదనకు ఆ దేశ పార్లమెంట్ ‘నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్’ (ఎన్‌పీసీ) స్థాయీ సంఘం నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో అధిక సంతానానికి ప్రజలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా ప్రతిపాదన తీసుకొచ్చింది. కుటుంబాలపై పడే భారం, పిల్లలను పెంచేందుకు, చదువుకు అయ్యే వ్యయాలను తగ్గించడంతోపాటు ఆర్థిక సాయం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. కాగా, ఈ ఏడాది మేలో ఇద్దరు పిల్లల విధానాన్ని సడలించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతి నిచ్చింది.

ఇది కూడా చదవండి: సీజేఐ ఎన్.వి రమణకు కాంగ్రెస్ నేత వీహెచ్‌ లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement