తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు ఫైనల్ పరీక్ష రాయడానికి వయస్సును తగ్గిస్తూ రాష్ట్ర విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో 12 ఏళ్ల వయస్సు ఉన్న వారు కూడా పదో తరగతి చదవ వచ్చు. అంతే కాకుండా పదో తరగతి ఫైనల్ పరీక్షను కూడా రాయవచ్చు. అయితే గతంలో ఉన్న నిబంధనల ప్రకారం పదో తరగితి చదవాలన్నా.. ఫైనల్ పరీక్ష రాయాలన్నా.. విద్యార్థి తప్పకుండా 14 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
కానీ తాజాగా రాష్ట్ర విద్యా శాఖ పదో తరగతి చదవడానికి విద్యార్థులకు రెండు సంవత్సరాలు మినహాయింపు ఇచ్చింది. అయితే పదో తరగతికి విద్యార్థులకు ఇచ్చిన రెండు సంవత్సరాల మినహాయింపు వర్తించాలి అంటే.. రూ. 300 చలానా కట్టాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు రాసే విద్యార్థులు మార్చి 3వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని రాష్ట్ర విద్యా శాఖ అధికారులు తెలిపారు.