భారత్ లో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. ఇప్పటికే 140 కోట్ల డోసులు పంపిణీ చేయగా.. తాజా పిల్లలకు టీకాలు వేసేందుకు సిద్ధమవుతోంది. దేశం 5 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన క్రమంలో 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జవవరి 3 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీని కోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు కోవిన్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ వెల్లడించారు. వ్యాక్సిన్ కోసం కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్ కార్డ్ తో కోవిన్ యాప్ ద్వారా టీకా తీసుకునే వారు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఒక వేళ ఆధార్ కార్డ్ లేకుంటే.. విద్యా సంస్థ గుర్తింపు కార్డు ద్వారా టీకాను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital