Wednesday, November 20, 2024

రిపోర్ట‌ర్ గా మారిన చిన్నారి – ఏం చెప్పిందో తెలుసా

సోష‌ల్ మీడియా ప్ర‌భావ‌మా అని ఎక్క‌డ ఏ విష‌యం జ‌రిగినా తెగ వైర‌ల్ గా మారిపోతోంది. కాగా ఓ చిన్నారి త‌మ ప్రాంతంలో రోడ్ల ప‌రిస్థితిని వివ‌రించిన తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. రిపోర్ట్ లా మారి ఎంతో చ‌క్క‌గా వివ‌రించింది అక్క‌డి ప‌రిస్థితిని. కాగా క‌శ్మీర్ కి చెందిన ఈ చిన్నారిపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రశంల వర్షం కురుస్తోంది. ఇంత చిన్న వయసులో ఎంత చక్కగా మాట్లాడింది అంటూ.. ప్రశంసిస్తున్నారు.తన వీడియో చూసిన తర్వాత.. లైక్, కామెంట్, సబ్ స్క్రైబ్ చేయండి అంటూ.. ఆ చిన్నారి చివరిలో తెలంప‌డం విశేషం.తర్వాతి వీడియోలో మళ్లీ కలుస్తానంటూ.. చెప్పి వీడియోని ముగించింది. ఈ వీడియోని కొన్ని వేల మంది ట్విట్టర్ లో షేర్ చేశారు. లక్షల మంది వీక్షించారు. కాగా.. చిన్నారి గతంలోనూ ఇలాంటి వీడియోలు చేయడం గమనార్హం. ఇప్పుడు రోడ్ల పరిస్థితి వివరించగా.. గతంలో.. ఆన్ లైన్ విద్య గురించి అధికారుల సహాయం కోరింది.

ఈ వీడియోలొ చిన్నారి.. పింక్ జాకెట్ ధరించి ఉంది.. కశ్మీర్ లోని తాము ఉంటున్న ప్రాంతంలో.. రోడ్లు.. సరిగా లేవని.. దాని కారణంగా.. అతిథులు.. ఆ ప్రదేశానికి రాలేకపోతున్నారని.. ఆ చిన్నారి వీడియోలో వివరించడం విశేషం.కాగా.. కశ్మీర్ వ్యాలీ నుంచి అతి పిన్న వయస్కురాలైన రిపోర్టర్ ని కలుసుకోండి. అంటూ.. చిన్నారి వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. కాశ్మీర్ లోయలో ఇటీవల భారీ మంచు, వర్షం కురిసింది. ఆ వర్షం దాటికి బురద పేరుకుపోయి.. రోడ్లు ఎంత అధ్వాన్నంగా మారాయో వివరిస్తూ.. ఆ చిన్నారి 2 నిమిషాల వీడియోని చిత్రీకరించింది. మొబైల్ ఫోన్ లో ఈ వీడియో తీసింది. తాను నడుచుకుంటూ రోడ్డు మీద గుంతలను చూపించింది. రోడ్డుపై ప్రజలు చెత్త కూడా వేస్తున్నారని.. ఆమె ఆ వీడియోలో చూపించింది.ఈ వీడియో పోస్ట్ చేసి రెండు రోజులు అయినా ఇంకా వైర‌ల్ చేస్తున్నారు నెటిజ‌న్స్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement