సీడీఎస్ బిపిన్ రావత్ మరణంతో ఆ స్థానం ఖాళీ అయింది. దాంతో చీఫ్స్ ఆఫ్ స్టాప్ కమిటీ చైర్మన్ గా ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా ఉన్న ఎంఎంనరవణె బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఎంఎం నరవణె త్రివిధ దళాల చీఫ్ కమిటీలకు చైర్మెన్ గా వ్యవహరిస్తారు. సీఎడీఎస్ గా బిపిన్ రావత్ బతికి ఉన్న సమయంలో త్రివిధ దళాలకు అధిపతిగా ఉండే వారు. కానీ ఆయన మరణం తర్వాత చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మెన్ గా ఎంఎం నరవణె ను నియమిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.ఇప్పుడు ఉన్న మూడు విభాగాల్లో సీనియర్ గా ఉన్న ఎంఎం నరవణె నే చైర్మెన్ గా ఎన్నుకున్నారు. ఈ కమిటీ లో ఆర్మీ, వాయు సేన, నావికా దళాల చీఫ్ లు సభ్యులు గా ఉంటారు. త్రివిధ దళాల విషయం లో చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మెన్ నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement