బిజెపి నేత గజారియా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే భార్య రష్మి థాకరేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ వ్యాఖ్యలపై శివసేన నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా రష్మి థాకరేని ఉద్దేశిస్తూ మరాఠి రబ్రీదేవి అని ట్వీట్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యాఖ్యలపై ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ మండిపడ్డారు. బిజెపి జాతీయ స్థాయిలో ఎదగడానికి శివసేన వ్యవస్థాపకులు బాలాసాహెబ్ థాకరే ఎంతో చేశారని… అలాంటి వ్యక్తి కోడలిని కించపరుస్తూ ఎలా మాట్లాడతారని నిలదీశారు. పార్టీలు మారే గజారియా మహారాష్ట్ర మహిళపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గజారి ఎన్సీపీ నుండి బిజెపిలోకి వెళ్లిన వ్యక్తి నేడు రష్మి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అసలు రాజకీయాల్లోకి రష్మీ థాకరేని లాగాల్సిన పనేంటని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు మహిళలని కించపరిచేవిగా ఉంటాయని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..