Tuesday, November 26, 2024

జగన్ బెస్ట్ సీఎం… నెంబర్ ఎంతో తెలుసా?

సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి తన విశ్వరూపం చూపిస్తోంది. దేశవ్యాప్తంగా నాలుగు లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. మరోవైపు వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. కరోనా నివారణకు దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యల చేపట్టాయి. కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేస్తుంటే.. మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. ఏపీలో పగటి కర్ఫ్యూ కూడా అమలవుతోంది.

కరోనా వైరస్ వ్యాప్తి భయపెడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనే అంశంపై ఒర్మాక్స్ మీడియా సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వే కోసం ఏప్రిల్‌లో మాత్రమే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, ముఖ్యమంత్రుల వ్యవహార శైలి, పరిపాలనా సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళిక, దాని అమలు తీరును ఆధారంగా చేసుకుంది. తరువాత అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాను రూపొందించింది. దాన్ని ప్రజామోదం కోసం విడుదల చేసింది.


అయితే ఈ జాబితాలో ఏపీ సీఎం జగన్ రెండో స్థానంలో నిలిచారు. దేశ వ్యాప్తంగా ఓటింగ్ లో పాల్గొన్న వారు ఆయనకు 55 పాయింట్లను ఇచ్చారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో నిలిచారు. అస్సాం, కేరళ ముఖ్యమంత్రులు శర్బానంద సొనొవాల్, పినరయి విజయన్ సంయుక్తంగా మూడో స్థానాన్ని చేజక్కించుకున్నారు. వారిద్దరికీ 54 చొప్పున పాయింట్లు వచ్చాయి. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు. యోగి ఆదిత్యనాథ్-53, మమతా బెనర్జీ-52 పాయింట్లను సాధించారు. 46 పాయింట్ లతో తెలంగాణ సీఎం కేసీర్ 15వ స్థానంలో నిలిచారు. చివరి రెండు స్థానాల్లో హర్యానా, పంజాబ్ ముఖ్యమంత్రులు నిలిచారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న వేళ.. దేశంలో అత్యుత్తమ సీఎంలో జగన్ ది రెండో స్థానంలో నిలవడం గమనార్హం.

ఇదీ చదవండి: సంగం డెయిరీ కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

Advertisement

తాజా వార్తలు

Advertisement