Sunday, November 17, 2024

మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో ప్ర‌జ‌ల‌కు మేలు: జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌

మధ్యవర్తిత్వం అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్నదని.. దీని వల్ల సామాన్య ప్రజలకు మేలు కలుగుతుందని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి  జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అయితే వివాద ప‌రిష్కారాల్లో రాజ్యాంగ స‌మాన‌త్వం ఉండాల‌ని తెలిపారు. . ఇండియా- సింగపూర్​ మీడియేషన్​ సమ్మిట్​లో పాల్గొన్న ఆయన… మధ్యవర్తులు సలహాదారుడిగా మారడం మంచి పరిణామం కాదన్నారు. మ‌ధ్య‌వ‌ర్తుల‌కు శిక్ష‌ణ ఇస్తే సాధార‌ణ ప్ర‌జానీకానికి మేలు జ‌రుగుతుంద‌న్నారు. మీడియేషన్ అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్నదని.. మధ్యతరగతి ప్రజలకు న్యాయం జరిగేందుకు ఇది సులభమైన మార్గమని చెప్పారు. అయితే మధ్యవర్తులు.. మంచి గుణం, నైతికత, పారదర్శకత, తటస్థత వంటి లక్షణాలను కలిగి ఉండాలని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు.

 

Advertisement

తాజా వార్తలు

Advertisement