Saturday, November 23, 2024

చికెన్ రేటు తగ్గింది.. గుడ్డు రేటు పెరిగింది

కరోనా మహమ్మారితో పోరాడేందుకు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ప్రతి ఒక్కరు చికెన్, మటన్, గుడ్లు బాగా తింటుంటారు. దీంతో వాటి ధరలు ఆకాశాన్ని అంటాలి. కానీ అందుకు భిన్నంగా ఏపీలో చికెన్ ధరలు ఒక్క సారిగా ఢమాల్ అని పడిపోయాయి. కేజీ చికెన్ ధర ఏకంగా రూ.70-80 వరకు తగ్గిపోయింది. గత వారం బ్రాయిలర్‌ చికెన్‌ కిలో రూ. 220 లెక్కన అమ్మగా, ప్రస్తుతం ఆ ధర రూ.140- 150కి పడిపోయింది. గత వారం కిలో రూ.120 ఉన్న ఫామ్‌గేట్‌ ధర ఇప్పుడు 80 రూపాయిలు మాత్రమే పలుకుతోంది.

వేసవి కారణంగా 30 శాతం వరకు వినియోగం తగ్గింది. దీనిపై ధరలపై తీవ్ర ప్రభావం పడిందని వ్యాపారులు చెబుతున్నారు. . అయితే, నిరుడు ఇదే సమయంలో కిలో చికెన్‌ రూ.250పైగా పలకగా…అప్పుడు కరోనా బారిన పడకుండా, ఇమ్యూనిటీ కోసం లాక్‌డౌన్‌ సడలింపు సమయాల్లో చికెన్‌, మటన్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇప్పుడు.. ఆదివారాలు తప్ప, మిగిలిన రోజుల్లో చికెన్‌ దుకాణాల దగ్గర పెద్దగా సందడి లేదని వ్యాపారులు వాపోతున్నారు. చికెన్ తో పాటు కోడిగుడ్ల ధరలు కూడా భారీగా ప‌త‌నమ‌య్యాయి. హోల్‌సేల్‌గా 100 గుడ్లకు రూ. 50- 60 వరకు తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. రిటైల్‌గా ప్రస్తుతం ఒక్కో కోడి గుడ్డు రూ.5 చొప్పున అమ్ముతున్నారు. ఓవైపు ఎండాకాలం ఉష్ణోగ్రత‌లు భారీగా పెర‌గ‌డంతో కోళ్లు అనారోగ్యానికి గురై చ‌నిపోతున్నాయి. దీంతో వ్యాపారులు తీవ్ర న‌ష్టాల‌ను ఎద‌ర్కోవాల్సి వ‌స్తుంది. కోవిడ్ ప్రభావంతో కూలీలు కూడా స‌రిగ్గా దొరక్క కోళ్ల ఫారాల‌ను మూసివేయాల్సి వ‌స్తుంద‌ని వ్యాపారులు వాపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement