ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందాడు. దంతేవాడ జిల్లాలోని తుమాక్పాల్ అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ) గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందాడని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు. అతడిని మావోయిస్టు దర్భా డివిజన్‌లో ప్లాటూన్ కమాండర్ లఖ్మా కవాసీగా గుర్తించామని చెప్పారు. అతని నుంచి తుపాకీ, ఐదు కిలోల మందుపాతర (ఐఈడీ), ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అతనిపై రూ.3 లక్షల రివార్డు కూడా ఉందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital