Tuesday, October 22, 2024

యువకుడి చెంప చెళ్లుమనిపించిన కలెక్టర్‌పై వేటు!

లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఓ యువకుడి చెంపను ఛెళ్లుమనిపించిన సూరజ్‌పూర్ కలెక్టర్ రణబీర్ శర్మపై వేటు పడింది. ఈయన్న సస్పెండ్ చేస్తున్నట్లు ఛత్తీస్ గడ్ సీఎం భూపేశ్ బఘేల్ తెలిపారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని సీఎం స్పష్టం చేశారు. కలెక్టర్ చర్యను తీవ్రంగా ఖండించారు. రణబీర్‌ను తప్పించిన సీఎం ఆయన స్థానంలో రాయ్‌పూర్ జిల్లా పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవ్‌ కుమార్ సింగ్‌ ను నియమించారు.

మరోవైపు, రణబీర్ ప్రవర్తనను ఐఏఎస్ అసోసియేషన్ కూడా తీవ్రంగా తప్పుబట్టింది. ఆయన ప్రవర్తన ఎంతమాత్రమూ సమర్థనీయం కాదంటూ ట్వీట్ చేసింది. సేవ, నాగరితక ప్రాథమిక సిద్ధాంతాలకు ఇది పూర్తిగా విరుద్ధమని పేర్కొంది. కాగా, కలెక్టర్ రణబీర్ శర్మ ఆ తర్వాత తన ప్రవర్తనకు క్షమాపణలు తెలిపారు.

కాగా, మందులు కొనడానికి వెళుతున్న వ్యక్తిపై కలెక్టర్ రణ్ బీర్ శర్మ చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. ఛత్తీస్ గడ్ లో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. సూరజ్ పూర్ జిల్లా కలెక్టర్ రణబీర్ శర్మ లాక్ డౌన్ అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో అత్యవసరంగా మందులు కొనడానికి వెళ్తున్న ఓ వ్యక్తిని కలెక్టర్ రణ్ బీర్ శర్మ, పోలీసులు అడ్డుకుని దురుసుగా ప్రవర్తించారు. ఆ వ్యక్తి మందులకు సంబంధించిన చీటీలు చూపిస్తున్నా… ఫోన్ లాక్కొని నేలకోసి కొట్టి చెంప చెల్లుమనిపించాడు కలెక్టర్. పోలీసులను కూడా కొట్టమని ఆదేశాలిచ్చాడు. ఇద్దరు కానిస్టేబుళ్లు లాఠీలతో చావబాదారు. కలెక్టర్ కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కలెక్టర్ తీరుపై విమర్శులు వెల్లువెత్తతాయి. కలెక్టర్‌ రణ్‌ బీర్‌ కూడా ఈ ఘటనపై స్పందించారు. తాను కావాలని చేయలేదని..అంటూ క్షమాపణలు చెప్పారు.

ఇదీ చదవండి: ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ లా? : మోదీకి జగన్ లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement