Friday, November 22, 2024

CHEVELLA: వైస్సార్ సెంటిమెంట్‌.. షర్మిళకు కలిసివచ్చేనా?

ఉమ్మడిరంగారెడ్డి, ప్రభన్యూస్‌బ్యూరో: డాక్టర్‌ వైఎస్‌రాజశేఖర్‌రెడ్డికి చేవెళ్ల సెంటి మెంట్‌ బాగా కలిసివచ్చింది. ఇక్కడి నుంచి చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావడమే కాకుండా 2004లో జరిగిన అసెంబ్లిd ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకవచ్చింది. తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఏ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా చేవెళ్లనుండే ప్రారంభించారు. అప్పట్లో చేవెళ్ల అసెంబ్లిdకి పట్లోళ్ల సబితారెడ్డి ప్రాతినిథ్యం వహించారు. ఆమెను అందరూ చేవెళ్ల చెల్లెమ్మగా పిలిచేవాళ్లు.. వైఎస్‌ బాటలోనే ఆయన తనయ వైఎస్‌ షర్మీల కూడా చేవెళ్లనే సెంటిమెంట్‌గా భావి స్తున్నారు. అందులో భాగంగానే ఈనెల 20వ తేదీన చేవెళ్ల గడ్డ పైనుంచే పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఏకంగా 14మాసాలపాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను ప్రారం భించనున్నారు. చేవెళ్ల సెంటిమెంట్‌ ఆమెకు ఎంతమేర కలిసి వస్తుందో వేచి చూడాలి.

దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా చేవెళ్ల పేరు మారుమ్రోగింది. ఎవరినోట విన్నా చేవెళ్ల సెంటిమెంట్‌ పేరే వినిపించేది. 2003 సంవత్సరం ఏప్రిల్‌ 9వ తేదీన వైఎస్‌ చేవెళ్ల నుండి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాతాళానికి వెళ్లిన కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకరావాలంటే పాదయాత్రే శరణ్యమని భావించారు. ఎండలను సైతం లెక్క చేయకుండా చేవెళ్ల గడ్డమీది నుండి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అనుకున్నట్లే పాదయాత్ర సక్సెస్‌ కావడం 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం వైఎస్‌ఆర్‌ సీఎం కావడం చకచక జరిగి పోయింది. చేవెళ్ల నుండి పాదయాత్ర ప్రారం భించినందుకే అధికారంలోకి వచ్చామని వైఎస్‌ గట్టిగా నమ్మా రు అందులో భాగంగానే ఏ కార్యక్రమం ప్రారం భించిన చేవెళ్ల నుండే ప్రారంభించేవాళ్లు. అప్పట్లో చేవెళ్ల నియోజకవర్గానికి ప్రాతి నిథ్యం వహిస్తున్న పట్లోళ్ల సబితారెడ్డి చేవెళ్ల చెల్లె మ్మగా పాపులర్‌ అయ్యా రు. ఐదేళ్లపాటు చేవెళ్ల నియో జక వర్గంలోనే అన్ని కార్యక్ర మాలకు శ్రీకారం చుట్టేవాళ్లు. వైఎస్‌ చేవెళ్ల సెంటిమెంట్‌ను బాగా కలిసి రావడంతో ఆయన తనయ వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మీల కూడా చేవెళ్ల సెంటి మెంట్‌పై ఆశలు పెట్టుకున్నారు. అందులో భాగం గానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 14నెలల పాటు పాదయాత్రకు బుధవారం రోజు శ్రీకారం చుట్ట బోతున్నారు. వైఎస్‌కు బాగా కలిసివచ్చిన చేవెళ్ల గడ్డపైనుండే ఆమె కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. సెంటిమెంట్‌ ఎంతమేర కలిసి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వైఎస్‌ఆర్‌ మాదిరిగానే షర్మీల కూడా సెంటిమెంట్‌గా భాగా నమ్ముతున్నారు. అందులో భాగంగానే తాను కూడా చేవెళ్లనుండే పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement