అహ్మదాబాద్: ఐపీఎల్ ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. చివరి బంతి దాకా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌ను 5 వికెట్ల తేడాతో ఓడిం చింది. ఐదోసారి టైటిల్ విజేతగా నిలిచింది. చివరి రెండు బంతులకు 10 పరుగులు రావాల్సిన సమయంలో, సీఎస్‌కే బ్యాటర్ జడేజా అద్భుతం చేశాడు. వరుసగా సిక్స్, ఫోర్‌కొట్టి చెన్నైని విజయతీరాలకు చేర్చాడు. వర్షం అంతరాయం కలిగించడంతో చెన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులకు కుదించారు. దీంతో లక్ష్యఛేదనకు దిగిన చెన్నై ఐదు వికెట్లు కోల్పోయి చివరి బంతికి నెగ్గింది. సీఎస్‌కేలో కాన్వే (47), శివమ్ దూబె (32నాటౌట్), రహానే (27), గైక్వాడ్ (26), రాయుడు (19) రాణించారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. వర్షం అంతరాయం తర్వాత ఓపెనర్లు గైక్వాడ్ (26), డెవాన్ కాన్వే (47) వేగం పెంచారు. ప్రతి బంతినీ బౌండరీ దాటించాలన్నంత కసిగా ఆడారు. ఈ క్రమంలో 6.3 ఓవర్లలో మొదటి వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యం నెలకొ ల్పారు. జోరుమీదున్న వీరిద్దరినీ ఒకే ఓవర్ లో నూర్ అహ్మద్ ఔట్‌చేసి షాకిచ్చాడు. ఆ తర్వాత శివం దూబె, అజింక్య రహానే (27; 13బంతులు) దూకుడు కొనసాగించారు. మోహి త్‌శర్మ బౌలింగ్‌లో 11 ఓవర్ ఐదవ బంతికి భారీషాట్ కు ప్రయత్నించిన రహానే బౌండరీలైన్ వద్ద విజయ్ శంకర్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఐపీఎల్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న అంబటి రాయుడు (19: 8బంతులు) బ్యాట్ ఝులిపించాడు. ధోనీ తానెదుర్కొన్న తొలి బంతికే ఔటై నిరాశ పరిచాడు. ఆఖర్లో శివం దూబె (నాటౌట్) (32)తో కలిసి రవీంద్ర జడేజా జట్టుకు అనూహ్య విజయాన్ని అందించాడు. చివరి ఓవర్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ, జడేజా భారీ షాట్లతో తలైవాకు చిరస్మరణీయ కానుకను అందించాడు. ఆఖరు రెండు బంతులను సిక్స్, ఫోర్ బాదేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. గుజరాత్ బౌలర్లలో మోహిత్‌శర్మ 3 వికెట్లు, నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీశారు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ హోంగ్రౌండ్‌లో చెలరేగింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభించినప్పటికీ, ఆ తర్వాత మెలమెల్లగా టాప్‌గేర్‌లో నడిపించారు. వృద్ధిమాన్ సాహా (54: 39 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్స్) అర్ధశతకంతో చెలరేగగా, శుభ్‌మన్‌గిల్ (39: 20 బంతుల్లో 7ఫోర్లు), దూకుడుగా ఆడాడు. రెండు పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి గట్టెక్కిన గిల్, బెదురులేకుండా భారీషాట్లతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తుషార్ వేసిన నాలుగో ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు బాదాడు. మెరుపు వేగంతో భారీషాట్లు ఆడుతూ అలరించాడు. అతడికి వృద్ధిమాన్ సాహా నుంచి చక్కటి సహకారం లభించింది. అయితే గిల్ దూకుడుకు జడేజా బ్రేక్‌లు వేశాడు. ఆరో ఓవర్ చివరి బంతిని క్రీజ్‌బయటకొచ్చి ఆడే క్రమంలో ధోనీ మెరుపు కీపింగ్‌కు బలయ్యాడు. బంతికి చేతికి అందగానే రెప్పపా టులో వికెట్లను గిరాటేశాడు. ధోనీ కేవలం సెకను వేగంలో స్పందించడం విశేషం.
ఇక గిల్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సాయిసుదర్శన్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ స్కోరు బోర్డును పరుగెత్తించాడు. మరోవైపు కెప్టెన్ హార్దిక్ పాండ్యా అండగా నిలవగా, సాయి సుదర్శన్ (96: 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న సుదర్శన్, అటు తర్వాత వేగం పెంచాడు. తుషార్ వేసిన 17వ ఓవర్‌లో వరుసగా సిక్సర్‌తోపాటు హ్యాట్రిక్ బౌండ రీలతో ప్రత్యర్థిని హడలెత్తించాడు. పతిరణ వేసిన ఆఖరి ఓవ ర్లో మొదటి రెండు బంతుల్ని సిక్సర్లుగా మలచిన సుద ర్శన్, మూడవ బంతికి వికెట్ల ముందు దొరికిపో యాడు. అయితే దురదృష్ట వశాత్తు సెంచరీ మిస్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా (21:12బంతులు) ధాటిగా ఆడి జట్టు స్కోరును రెండు వందలు దాటించాడు. ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయి 14 పరు గులు చేసింది. మొ త్తంగా భారీ స్కోరు తో ప్రత్యర్థికి 215 పరు గుల లక్ష్యాన్ని నిర్దేశిం చింది. క్యాచ్‌లు, రనౌట్ల విష యంలో తడబడిన చెన్నై సూ పర్ కింగ్స్ అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. చెన్నై బౌలర్లలో పతిరణ రెండు వికెట్లు తీయగా, దీపక్ చాహర్, జడేజా ఒక్కొక్క వికెట్ పడగొట్టారు.
వరుణుడు మళ్లొచ్చాడు…
చెన్నై సూపర్ కింగ్స్ లక్ష్య ఛేదనకు దిగుతుండగా చిన్నపాటి జల్లులు పడ్డాయి. దాంతో పిచ్‌ను కవర్లతో కప్పే శారు. కొన్ని నిముషాల తర్వాత చినుకులు ఆగిపోవడంతో కవర్లను తొలగించి మ్యాచ్‌ను ప్రారంభించారు. రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే ఓపెనింగ్ జోడీగా క్రీజ్‌లోకి చేరుకోగా, తొలి ఓవర్‌ను మహ్మద్ షమీ ఆరంభించాడు. మూడు బంతులు పడగానే మళ్లిd వర్షం మొదలైంది. దాంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. దాదాపు 40 నిముషాల తర్వాత వర్షం ఆగింది.
అయితే మైదానంలో నీటిని తొలగించేందుకు గ్రౌండ్ సిబ్బంది రంగంలోకి దిగారు. పలుమార్లు గ్రౌండ్‌ను పరిశీలించిన అంపైర్లు చివరకు 11.45 గంటలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. 12.10కి మ్యాచ్ ప్రారంభించాలని నిర్ణయించారు. 15ఓవర్లకు కుదిం చిన ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే లక్ష్యాన్ని 171 పరుగులుగా నిర్ధారించారు.