టాటా ఐపీఎల్లో భాగంగా ఇవ్వాల చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ తడబుడుతోంది. ధోనీ సారథ్యంలో చెన్నై పెట్టిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో సన్రైజర్స్ జట్టు కష్టాల్లో మునిగిపోయింది. నిలదొక్కుకున్నాడని అనుకున్న కెప్టెన్ కేన్ మామ (47) పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ప్రిటోరియస్ వేసిన బంతిని ఆడే క్రమంలో విలియమ్సన్ మిస్ అయ్యాడు. ఎల్బీ కోసం అప్పీల్ చేయగా అంపైర్ అవుట్ ఇచ్చాడు. అయితే విలియమ్సన్ వెంటనే రివ్యూ కోరాడు. కానీ రిప్లేలో కూడా అతను క్లియర్గా అవుటని తేలడంతో మైదానం వీడాడు. దీంతో 126 పరుగుల వద్ద సన్రైజర్స్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. కాగా, 17 ఓవర్లలో 147 పరుగులు చేసిన హైదరాబాద్ జట్టు.. మరో 18 బంతుల్లో 56 పరుగులు చేయాల్సి ఉంది.
Breaking: ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ ఇన్నింగ్స్.. టార్గెట్ ఛేదనలో తడబడుతున్న హైదరాబాద్
Advertisement
తాజా వార్తలు
Advertisement