Friday, November 22, 2024

కూలిన చీతా హెలికాఫ్ట‌ర్ – పైల‌ట్ మృతి

చీతా హెలికాఫ్ట‌ర్ కూలిపోయింది.ఈ ప్ర‌మాదంలో ఒక పైల‌ట్ మృతి చెందారు. ఈ హెలికాఫ్ట‌ర్ ఇండియ‌న్ ఆర్మీకి చెందింది. అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని త‌వాంగ్ ఏరియాలో ఇవాళ కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక పైల‌ట్ అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. భార‌త ఆర్మీ అధికారులు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అయితే, ఈ హెలిక్యాప్ట‌ర్ ప్ర‌మాదానికిగ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. చీతా హెలిక్యాప్ట‌ర్‌లను 1976 నుంచి హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ త‌యారు చేస్తున్న‌ది. ఈ హెలిక్యాప్ట‌ర్‌లను ఆర్మీ ర‌క‌ర‌కాల సేవ‌ల‌కు వినియోగిస్తున్నారు. మిగ‌తా హెలిక్యాప్ట‌ర్ల‌తో పోల్చితే అత్యంత ఎత్తుకు ఎగ‌ర‌గ‌ల హెలిక్యాప్ట‌ర్‌లుగా కూడా వీటికి పేరున్న‌ది. ఆర్మీ స్థావ‌రాల‌పై గ‌స్తీ నిర్వ‌హ‌ణ‌లో, విప‌త్తుల సందర్భంగా ర‌క్ష‌ణ‌, స‌హాయ‌క చ‌ర్య‌ల్లో వీటిని వినియోగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement