Friday, November 22, 2024

ఒమిక్రాన్‌కు చెక్ పెట్టొచ్చు.. గుడ్ న్యూస్ చెప్పిన మోడెర్నా..

ప్రపంచాన్ని మళ్లీ భయాందోళనకు గురిచేస్తోన్న కరోనా అప్‌డేటెడ్ వ‌ర్ష‌న్‌ ఒమిక్రాన్ ను త‌ట్టుకునేలా టీకా ఉంద‌ని వ్యాక్సిన్ త‌యారీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. త‌మ టీకాతో ఒమిక్రాన్‌కు పూర్తిగా చెక్‌ పెట్టవచ్చని మోడెర్నా ఈరోజు తెలిపింది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను తమ టీకా బూస్టర్‌ డోసు సమర్థంగా నిలువరించగలదని చెప్పింది.

అయితే.. మోడెర్నా బూస్టర్‌ డోసును సగం తీసుకుంటే.. ఒమిక్రాన్‌పై పోరాడే యాంటీబాడీల స్థాయిలు 37శాతం పెరుగుతున్నట్లు ప్రాథమిక ప్రయోగ పరీక్షల్లో తేలిందని మోడెర్నా వెల్లడించింది. బూస్టర్‌ డోసును పూర్తి మోతాదులో తీసుకుంటే వాటి స్థాయులు ఏకంగా 83 రెట్లు అధికమవుతున్నట్లు వివరించింది. అయితే బూస్టర్‌ డోసును పూర్తిగా తీసుకుంటే సాధారణ దుష్పరిణామాలు తలెత్తే అవకాశాలు కూడా కొంత పెరుగుతున్నాయని మోడెర్నా పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement