Tuesday, November 26, 2024

ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదరిపై చీటింగ్ కేసు

ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయనే సామెత ఎన్టీవీ ఛైర్మన్‌కు అతికినట్లు సరిపోతుంది. సమాజంలో అక్రమాలను బ్రేకింగ్ న్యూస్ వేసే చౌదరి గారు.. ఇప్పుడు తానే ఒక బ్రేకింగ్ న్యూస్ అయ్యారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాలపై సొసైటీ మాజీ అధ్యక్షుడు, ఎన్టీవీ న్యూస్ ఛానల్ ఛైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరిపై కేసు నమోదయింది. సొసైటీలో నియమావళిని ఉల్లంఘించినట్టు, ఫోర్జరీ సంతకాలతో 853 ఎఫ్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసినట్టు బి.రవీంద్ర నాథ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1గా నరేంద్ర చౌదరి,పి. హనుంతరావును A2గా, ఏ. సురేష్ రెడ్డిని A3గా, సి హెచ్ కృష్ణమూర్తిని A4గా, డి. శ్రీనివాసరెడ్డిని A5గా, ఎండీ జావీదుద్దీన్‌ను A6గా, సీహెచ్ శిరీష A7, పి.శ్రీహరి A8గా బంజారాహిల్స్ జోన్ సబ్ రిజిస్ట్రార్ ఉన్నారు.

ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదరి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి పదేళ్లుగా ప్రెసిడెంట్ గా ఉన్నారు. తెలంగాణలో అత్యంత రిచ్ ప్రాంతమైన ఈ సొసైటీకి భారీ గా నిధులు, భూములు ఉన్నాయి. దీంతో అధ్యక్షుడు గా ఉన్న నరేంద్ర చౌదరి.. తన పలుకుబడి , న్యూస్ ఛానల్ అండ చూసుకొని అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెల రోజుల కింద కొత్తగా ఏర్పాటైన నూతన బాడీ.. సొసైటీ అక్రమాలపై ఫోకస్ పెట్టింది. కొన్ని ఆధారాలు లభించడంతో మాజీ అధ్యక్షుడు నరేంద్ర చౌదరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement