Friday, November 22, 2024

Breaking: ఢిల్లీ బ్రోకర్​ రామచంద్ర భారతిపై చీటింగ్​ కేసు.. విచారణ చేయొచ్చని ఆదేశాలిచ్చిన హైకోర్టు

తెలంగాణ ప్రభుత్వాన్ని డిస్టర్బ్​ చేయడానికి యత్నించి, నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఢిల్లీ నుంచి హైదరాబాద్​ వచ్చిన బ్రోకర్​ రామచంద్ర భారతిపై మరో కేసు నమోదు అయ్యింది. మొయినాబాద్​ ఫామ్​ హౌస్​లో నలుగురు ఎమ్మెల్యేలతో వందల కోట్ల రూపాయలకు బేరం ఆడుతూ వీడియోలు, ఆడియో రికార్డులకు దొరికిపోయారు ముగ్గురు వ్యక్తులు.. కాగా, ఈ కేసులో ఇవ్వాల హైకోర్టు ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది.

ఇక.. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన రామచంద్ర భారతిపై బంజారాహిల్స్​ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పైలట్​ రోహిత్​రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. రామచంద్ర భారతి నకిలీ ఆధార్​ కార్డు, నకిలీ పాన్​ కార్డు, నకిలీ డ్రైవింగ్​ లైసెన్స్​తో మోసం చేయడానికి యత్నించాడని రోహిత్​రెడ్డి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ, ఈడీ సంస్థల విచారణకు అందజేయాలన్న బీజేపీ పిటిషన్​ని హైకోర్టు పక్కన పెట్టిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement