Wednesday, November 20, 2024

స్నాక్స్ అమ్ముతూ రూ.కోట్లు సంపాదిస్తున్న చిరు వ్యాపారులు

టీ, స‌మోసా, పాన్లు, పానీపూరీలు అమ్ముతూ ఎవ‌రైనా రోజుకు ఎంత సంపాదిస్తారు.. మహా అయితే రూ.2వేలు లేదా రూ.5వేలు. కానీ ఉత్త‌రప్ర‌దేశ్‌లో అలాంటి చిరు వ్యాపారులు.. ఇన్‌క‌మ్ ట్యాక్స్ అధికారుల‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు. అనుమానం వచ్చి ఆయా వ్యాపారాలు చేసే వారి ఇళ్ల‌పై దాడులు చేసిన ఐటీ అధికారులకు మ‌తిపోయింది. ఒక్కొక్క‌రి ఆస్తి వంద‌ల కోట్లలో ఉండ‌టంతో అధికారులు నివ్వెర‌పోయారు.

కాన్పూర్‌లో స్నాక్స్ అమ్ముకునే 256 మంది కోటీశ్వరులని జీఎస్టీ అధికారుల పరిశీలనలో తేలింది. వీరిలోని చాలా మంది వద్ద ఖరీదైన కార్లు ఉన్నాయని తెలిపారు. ఒక్కొక్క‌రి ఇంట్లో కోట్లాది రూపాయ‌ల విలువ చేసే ఆస్తుల‌కు సంబంధించిన డాక్యుమెంట్లు దొరికాయి. వీరు ఇప్పటివరకు ఒక్క పైసా పన్ను చెల్లించకుండా వ్యాపారాలు నడుపుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. వీరి వద్ద మొత్తం రూ.375 కోట్ల సంపద ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.

ఈ వార్త కూడా చదవండి: అలసటగా ఉండే బండి నడపకండి

Advertisement

తాజా వార్తలు

Advertisement