Friday, November 22, 2024

చార్లీ సినిమా చూసి ఏడ్చేసిన సీఎం బొమ్మై.. తన పెట్​డాగ్​ యాదికి రావడమే కారణమట!

చార్లీ 777.. ఇది సినిమా మాత్రమే కాదు.. ప్రతి మనిషిలో ఉండే మానవత్వాన్ని తట్టిలేపే ఓ అద్భుతం అంటున్నారు చాలామంది. అయితే.. ఈ మధ్యనే రిలీజ్​ అయి హిట్​ టాక్​తో బాక్సీఫీసును షేక్​ చేస్తోంది ఈ సినిమా. ఈ మూవీ చూసిన కర్నాటక సీఎం బసవరాజ్​ బోమ్మై కూడా కంటతడి పెట్టుకున్నారు. అంతటి ఆప్యాయత శునకాలకు మాత్రమే ఉంటుందని చెప్పుకొచ్చారు బొమ్మ.

ముఖ్యమంత్రి పదవి ఉన్నతమైనది. ఆ హోదాలో ఉన్న వారు గంభీరంగా వ్యవహరిస్తారు. పవర్‌ఫుల్‌గా కనిపిస్తారు. కానీ, కర్నాట సీఎం బసవరాజు బొమ్మై మాత్రం చార్లీ 777 సినిమా చూసి చిన్న పిల్లాడిలో ఏడ్చేశారు. సినిమా చూసిన తర్వాత ఆయన థియేటర్ నుంచి బయటకు వచ్చి కంటనీరు పెట్టుకున్నారు. దీనికి కారణం ఆయన పెంపుడు కుక్క గుర్తుకు రావడమేనట.

సీఎం బసవరాజు బొమ్మై ఒక డాగ్ లవర్. ఆయన ఎంతో ఇష్టంగా, ప్రేమగా పెంచుకున్న పెట్​ డాగ్ స్నూబీ చనిపోయింది. బసవరాజు బొమ్మై సీఎం పదవి చేపట్టడానికి కొన్ని వారాల ముందు ఈ ఘటన జరిగింది. తన పెంపుడు కుక్క చనిపోయినప్పుడు బసవరాజు బొమ్మై బోరున విలపించారు. ఆ కుక్క డెడ్ బాడీకి పూలమాల వేసి ఉండగా.. ఆయన తన మోకాళ్లపై కూర్చుని కన్నీటి పర్యంతమైన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

777 చార్లీ సినిమా జూన్ 10న ఐదు భాషల్లో విడుదలైంది. ఈ సినిమాలో హీరో, ఆయన కుక్కకు మధ్య ఉన్న బాండింగ్‌ను అందరికి కనెక్ట్​ అయ్యేలా.. హృదయాలను ఆకట్టుకునేలా చిత్రించారు. ఈ సినిమా చూసిన సీఎం బసవరాజు బొమ్మై తనకు 777 చార్లీ సినిమా చాలా నచ్చిందని తెలిపారు. సినిమాను నిర్మించినవారిని పొగడ్తల్లో ముంచెత్తారు. అందరూ తప్పకుండా ఈ సినిమా చూడాలని కోరారు.

పెట్​ డాగ్స్​పై చాలా సినిమాలు వచ్చాయి కానీ, ఈ సినిమా భావోద్వేగాలు, జంతువులపై ప్రేమను సహజంగా ఉంచిందని వివరించారు. కుక్క దాని ఎమోషన్స్‌ను కళ్ల ద్వారా వెలువరిస్తుందని తెలిపారు. ఈ సినిమా బాగుందని, ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని పేర్కొన్నారు. తాను ఎప్పుడు షరతుల్లేని ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటారని, డాగ్ లవ్ స్వచ్ఛమైన, షరతుల్లేని ప్రేమ అని అన్నారు సీఎం బొమ్మై.

Advertisement

తాజా వార్తలు

Advertisement