వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్): ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కుదిపేసిన వరంగల్ మెడికల్ పీజీ స్టూడెంట్ ధరావత్ ప్రీతి సూసైడ్ కేసు ఫైనల్ స్టేజికీ వచ్చింది. వరంగల్ పోలీసులు ఇవ్వాల (బుధవారం) చార్జీ షీట్ ఫైల్ చేశారు. 970 పేజీలతో కూడిన చార్జీ షీట్ ను కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో 70 మందిని విచారించి తగిన సాక్ష్యాధారాలు సేకరించిన్నట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. సైంటిఫిక్, టెక్నికల్, మెడికల్, ఫోరెన్సిక్ నిపుణల సహకారంతో మృతురాలు ప్రీతి, నిందితుడు సైఫ్, వారి మిత్రులు వాడిన సెల్‌ఫోన్ డేటాని వెలికితీసిన్నట్టు చెప్పారు. మృతురాలు ప్రీతి మరణం కేసుకు సంబందించిన అన్నిరకాల సాక్ష్యధారాలు సేకరించిన్నట్లు పేర్కొన్నారు.
మెడికల్, ఫోరెన్సిక్ నిపుణల రిపోర్ట్ లు సేకరించి పరిశీలించిన్నట్లు సీపీ రంగనాథ్ వివరించారు. పోలీసులు జరిపిన విచారణలో నిందితుడు సైఫ్ , మృతురాలు ప్రీతీని పలు రకాలుగా ర్యాగ్గింగ్ పేరుతో వేదించడం వల్లే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించారని రుజువులు లభ్యమైన్నట్లు తెలిపారు. పోలీసులు అన్నికోణాల్లో సేకరించిన సాక్ష్యదారాలతో 970 పేజీలతో ఛార్జ్ షీట్ కోర్టులో ఫైల్ చేసిన్నట్లు సీపీ రంగనాథ్ వెల్లడించారు.