పంజాబ్ రాష్ట్ర సీఎం పదవి నియామకంపై కాంగ్రెస్ పార్టీ ప్రకటన గందరగోళానికి గురిచేస్తోంది. తనను అవమానిస్తున్నారంటూ కెప్టెన్ అమరిందర్ సింగ్ శనివారం సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా సుఖ్‌జిందర్ సింగ్ రణ్‌దవా పేరును నూతన సీఎంగా ఎంపిక చేసినట్లు ప్రకటించింది. అయితే పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోతి సింగ్ సిద్ధూ ఢిల్లీకి వెళ్లడంతో కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరి మారినట్లు తెలుస్తున్నది. కాగా ఇప్పుడు నూతన సీఎంగా చరణ్‌జిత్ చన్నీని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఇంతకుముందు సుఖ్‌జిందర్ సింగ్ రణ్‌దవా కొత్త పంజాబ్ సీఎంగా ఎంపిక చేసినట్లు అఖిల భారత కాంగ్రెస్ (ఏఐసీసీ) ఓ ప్రకటన చేసింది. కానీ తర్వాత మారిన పరిస్థితుల్లో చరణ్‌జిత్ చన్నీని ఎంపిక చేసినట్లు ఆదివారం సాయంత్రం మరో ప్రకటన చేసింది. చరణ్‌జిత్ చన్నీ దళిత సామాజిక వర్గానికి చెందిన వారు.
ఇది కూడా చదవండి: పంజాబ్ కొత్త సీఎంగా సుఖ్‌జిందర్ రణదావా