మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన రాముడని.. ఎన్టీఆర్ తన భీముడని ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెలిపారు. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో ఇవ్వాల జరిగింది. ఈ ఈవెంట్లో మాట్లాడిన రాజమౌళి ప్రీ రిలీజ్ వేదిక.. ఒక సంగమాన్ని తలపిస్తోందన్నారు. కర్నాటక స్టార్ హీరో శివకుమార్ ఫ్యాన్స్ సంగమం ఓవైపు.. మెగా ఫ్యాన్స్ సంగమం మరోవైపు.. నందమూరి ఫ్యాన్స్ సంగమం ఇంకోవైపు కనిపిస్తోందని ఉద్వేగంగా చెప్పారు. సినిమా రేట్ల పెంపు జీవోను పాస్ చేసినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సీఎం జగన్‌కు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఒక వ్యక్తి వచ్చి ముఖ్యమంత్రితో మాట్లాడి రెండుమూడు సార్లు కలిసి కొత్త జీవో రావడానికి.. రేట్లు పెరగడానికి కారణం అయ్యారు. ఆ వ్యక్తి ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఆయనను చాలా మంది చాలా మాటలు అన్నారు. మాకోసం ఆయన చాలా తగ్గారు. మీరు నిజంగా ట్రూ మెగాస్టార్ సార్. ఆయన్ను నేను ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను.. అని రాజమౌళి భావోద్వేగానికి గురయ్యారు. నేను అడిగిన వెంటనే ఏం చేస్తున్నాం.. ఏం తీస్తున్నాం అని అడగకుండా.. వాళ్ల ప్రతి అణువును సినిమా కోసం పెట్టిన రామ్ చరణ్, ఎన్టీఆర్‌కు ధన్యవాదాలు.
రామ్‌చరణ్.. హనుమంతుడి లాంటి వాడు. తన బలం ఏంటో తనకు తెలియదు. నందమూరి హరికృష్ణ ఎందుకు తారక్ అని పేరు పెట్టారో కానీ.. తన బలం ఏంటో తెలిసిన మహనీయుడు రాముడు.. అలాగే తన బలం ఏంటో తనకు తెలిసిన యాక్టర్ ఎన్టీఆర్. తనేంటో తెలుసు. తను ఏం చేయగలడో తెలుసు. చరణ్ గొప్ప నటుడు.. ఆ విషయం తనకు తెలియదు. తారక్.. గొప్ప నటుడు ఆ విషయం తనకు తెలుసు. ఇద్దరు గొప్పనటలు నా సినిమాలో నటించడం నా అదృష్టం.. అని రాజమౌళి స్పష్టం చేశారు.