ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో కలకలం చోటుచేసుకుంది. తాజా మాజీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిన్ని కృష్ణారావు, గొడవర్టి శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు మేళ్లచెర్వు వెంకటేశ్వర్ రావు, టీఆర్ఎస్ నాయకుడు కమర్తపు మురళి సహా మరికొందరు వ్యాపార ప్రముఖులపై చీటింగ్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. వీరంతా కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను సూడో సంస్థ పేరున రికార్డుల సృష్టించినట్టు కోర్టుకు ఆధారాలు అందాయి.
ఈ మేరకు కేసు నమోదు చేసి తగిన విచారణ జరపాలని త్రీటౌన్ పోలీసులను ఖమ్మం ప్రిన్సిపల్ మూడో అదనపు కోర్టు జడ్జి కుమారి పూజిత ఆదేశించారు. ఈ మేరకు చాంబర్ ప్రముఖులపై ఐపీసీ 420, 465, 406, 409, 419 రెడ్ విత్ 23 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.