టాలీవుడ్ చందమామ ప్రెగ్నెన్సీ రావడంతో సినిమాల నుంచి తప్పుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా కాజల్, భర్త గౌతమ్ కిచ్లు
కాజల్ ప్రెగ్నెన్సీని అధికారికంగా ప్రకటించాడు. తాజాగా కాజల్ మరో సంచలన పోస్టు చేసింది. బేబీ బంప్ ఉన్న ఫోటోలను షేర్ చేసి.. ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా చేసింది కాజల్ అగర్వాల్. ఇక ఈ ఫోటోల్లో కాజల్ బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుంది. గర్భధారణ సమయంలో, మన శరీరం బరువు పెరగడంతో పాటు అనేక మార్పులకు గురవుతాయి!! హార్మోన్ల మార్పులు శిశువు పెరిగేకొద్దీ మన కడుపు, రొమ్ములు పెద్దవిగా మారతాయి. మన శరీరం నర్సింగ్కు సిద్ధమవుతుంది. కొందరికి స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడవచ్చు. కొన్నిసార్లు మన చర్మం మొటిమలతో నిండిపోతుంది. కానీ గర్భ దారణ సమయంలో.. కుటుంబం సలహాలు తీసుకోవాలి. మీకు ఏం కావాలో వారికి చెప్పండి. వ్యాయామాలు చేయండి” అంటూ కాజల్ పేర్కొంది. కాజల్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..