Tuesday, November 26, 2024

ఏపీలో కర్ఫ్యూ వేళల్లో మార్పులు.. సినిమా థియేటర్లకు అనుమతి

ఏపీలో అమలు చేస్తున్న కర్ఫ్యూ సడలింపుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. తూ.గో., ప.గో. జిల్లాలలో పాజిటివిటీ రేటు 5 శాతం కంటే ఎక్కువ ఉండటంతో ఆయా జిల్లాలలో ఉ.6 గంటల నుంచి రా.7 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ సడలింపులను ప్రభుత్వం ఇచ్చింది. మిగిలిన జిల్లాలలో మాత్రం ఉ.6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సడలింపులకు అనుమతి ఇచ్చింది. దుకాణాలను మాత్రం రాత్రి 9 గంటలకే మూసివేయాలని సూచించింది.

మరోవైపు కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతపడ్డ సినిమా థియేటర్లను ఓపెన్ చేసుకునేందుకు ప్రభుత్వం ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చింది. కానీ సీటుకు సీటు మధ్య దూరం ఉంచాలని సూచించింది. ఈ మేరకు 50 శాతం సీటింగ్‌తో థియేటర్లు నిర్వహించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అటు రెస్టారెంట్లు, జిమ్‌లు, కళ్యాణ మండపాలకు కోవిడ్ ప్రోటోకాల్స్‌తో కూడిన అనుమతి ఇచ్చింది. కోవిడ్ విస్తరణను ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుంటూ అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించి భౌతికదూరం పాటించాలన్నారు.

ఇది కూడా చదవండి: ఆగస్టు నుంచే కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం

Advertisement

తాజా వార్తలు

Advertisement