Friday, November 22, 2024

కరోనా నుంచి కోలుకున్నారా? అయితే ఇలా చేయండి

కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ మనతో పాటు చుట్టూ ఉన్న వారు వైరస్ బారిన పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో మన చుట్టూ ఉన్న ప్రతి చిన్న విషయాలపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్‌ నుంచి కోలుకున్న వారంతా మొదట తమ టూత్‌ బ్రష్‌ను మార్చాలని సలహా ఇస్తున్నారు. దంతాలు శుభ్రం చేసుకునేందుకు పాత బ్రష్‌ను వినియోగించడం తిరిగి వైరస్‌ సోకే ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొంటున్నారు.

టూత్‌ బ్రష్‌లతో పాటు టంగ్‌ క్లీనర్లు సైతం మార్చాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సీజనల్‌గా వచ్చే ఫ్లూ, దగ్గు, జలుబు నుంచి కోలుకున్న వారు సైతం బ్రష్‌లు, టంగ్‌ క్లీనర్లు మార్చాలని వెల్లడించారు. ఇలా చేయడం ద్వారా తిరిగి ఫ్లూ సోకే ప్రమాదం తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే బాత్‌రూంలో వినియోగించే ప్రతిదాన్ని మార్చాలని, లేకపోతే తిరిగి సంక్రమణకు గురయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

వైరస్‌ చిన్న తుంపరలు, దగ్గు, తుమ్ము మొదలైన వాటి ద్వారా వైరస్‌ సోకిన వ్యక్తి నోటి నుంచి బయటకు వస్తాయి. తర్వాత చుట్టు పక్కల ఉన్న ఉపరితలాలను కలుషితం చేస్తాయి. లక్షణాలు వచ్చిన 20 రోజుల తర్వాత అందరూ టూత్ బ్రష్, టంగ్‌ క్లీనర్‌ మార్చాలి. నోటిలో ఉన్న వైరస్‌, బ్యాక్టీరియాను తొలగించేందుకు వెచ్చని నీటిలో కొంత ఉప్పు వేసి గార్లింగ్‌ చేయాలని సూచించారు. ఇది నోటిలో ఉన్న ఇన్ఫెక్షన్లను బయటకు పంపేందుకు ఉత్తమమైన మార్గమని తెలిపారు.

ఈ స్టోరీ కూడా చదవండి: కరోనా బాధితుల కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement