ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 మిషన్‌తో ఇవ్వాల చంద్రునికి మరింత దగ్గరగా భారత్ చేరుకుంది. వచ్చే బుధవారం చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్‌కు ముందు కీలకమైన విన్యాసాన్ని ల్యాండర్ ప్రదర్శించింది. వ్యోమనౌక యొక్క విక్రమ్ ల్యాండర్ దాని మొదటి ‘డీబూస్టింగ్ ఆపరేషన్’ సక్సెస్ అయ్యింది. ఇది చంద్రుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించడానికి కావాల్సిన వేగాన్ని తగ్గించే ప్రక్రియగా ఇస్రో వర్గాలు వెల్లడించాయి.
ఇక.. ల్యాండర్ మాడ్యూల్ (ఎల్‌ఎం) చురుకుగా పనిచేస్తోందని, దాని హెల్త్ కూడా బాగానే ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. డీ బూస్టింగ్ ప్రక్రియలో భాగంగా కీలక విన్యాసం విజయవంతమైందని దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తెలిపింది. ల్యాండర్ మాడ్యూల్ (LM) ఆరోగ్యం సాధారణంగా ఉందని, ఇది విజయవంతంగా డీబూస్టింగ్ ఆపరేషన్ జరిగినట్టు ఇస్రో వెల్లడించింది. కక్ష్యను 113 కిమీ x 157 కిమీకి తగ్గించినట్టు అధికారులు వెల్లడిచారు. కాగా, రెండవ డీబూస్టింగ్ ఆపరేషన్ ఆగస్ట్ 20వ తేదీన దాదాపు 0200 గంటలకు షెడ్యూల్ చేసినట్టు ఇస్రో తెలిపింది.