Friday, November 22, 2024

నారాయణ అరెస్టుపై అమిత్‌ షాకు చంద్రబాబు లేఖలు

నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేయ‌డంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలు రాశారు. ఈ అరెస్ట్ రాజకీయ కక్షతో జరిగిందని ఆరోపించారు. అరెస్ట్ చేసిన నారాయ‌ణ‌ను చిత్తూరుకు తరలించడంలో జాప్యం వెనక కూడా దురుద్దేశం ఉందని ఆయ‌న పేర్కొన్నారు. రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ సమయం జరిగిన ఉదంతాన్ని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. నారాయణను పోలీసు కస్టడీలో ఉంచే ప్రయత్నంపై ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ కేసులో అదనపు సెక్షన్ లు జోడించి అక్రమ అరెస్ట్ కు పాల్పడ్డారని ఆరోపించారు. చిత్తూరు ఎస్పీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అధికారి అని చంద్రబాబు ఆరోపించారు. ఈ ఘటనపై జోక్యం చేసుకుని న్యాయం చెయ్యాలని లేఖలో చంద్రబాబు కోరారు.

కాగా, పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో నారాయణను నిన్న పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆయనకు బెయిల్‌ లభించిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement