తిరుపతి : బొజ్జల అంత్యక్రియల అనంతరం మీడియాతో మాట్లాడారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు…మాట చెబితే తూచ తప్పకుండా అమలు చేసే వ్యక్తి బొజ్జల…విద్యార్థి దశ నుంచి బొజ్జల నాకు పరిచయం ఉందన్నారు..ప్రజల కోసం నిత్యం పనిచేసిన వ్యక్తి …రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేశారు…శ్రీకాళహస్తి అభివృద్ధిపైనే నాతో ఎప్పుడూ మాట్లాడేవారు…ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారన్నారు. శ్రీకాళహస్తి ప్రజలు గోపాలక్రిష్ణారెడ్డిని ఎప్పటికీ మర్చిపోలేరు..ఆప్తమిత్రుడిని కోల్పోయా..చాలా బాధ కలుగుతోంది..నన్ను విమర్సిస్తే ఊరుకునేవాడు కాదు..విలువలు, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి బొజ్జల అన్నారు..బొజ్జల అత్త లక్ష్మీదేవమ్మ మృతి కూడా బాధ కలిగించిందన్నారు. బొజ్జల కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా..అనంతరం చంద్రబాబు.. బొజ్జల అంత్యక్రియల్లో పాల్గొని బొజ్జల మృతదేహాన్ని మోసి ఆయన పట్ల తన అభిమానం చాటుకున్నారు..అనంతరం చిత్తూరుకు బయలుదేరి వెళ్ళారు.
బొజ్జల అంత్యక్రియల్లో చంద్రబాబు – పాడె మోసిన టిడిపి అధినేత
Advertisement
తాజా వార్తలు
Advertisement