అమరావతి, ఆంధ్రప్రభ: వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో కౌరవ వధ జరగాల్సిందేనని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు.. హైదరాబాద్‌కు ధీటుగా అమరావతిని నిర్మించాలని సంకల్పించామని, కానీ వైఎస్ జగన్ మూడు ముక్కలాటతో ప్రజల భవిష్యత్‌తో చెలగాటమా డాడని ధ్వజమె త్తారు. అమరావతి ఎక్కడికి పోద ని, తొమ్మిది నెలల తర్వాత అమరావతి రాజధానిని పరిగెత్తి స్తామని చెప్పారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఐటిడిపి కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యా రు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఎన్నికలకు తొమ్మిది నెలలే సమయం ఉందని, ఐటిడిపి కార్యకర్తలంతా యుద్దానికి సిద్దం కావాలని, ఇటీవల మహానాడులో ప్రకటించిన టీడీపీ మిని మ్యానిఫెస్టోను విస్తృతంగా జన ంలోకి తీసుకెళ్లాలని కోరారు. ఐటీడీపీ కార్యకర్తలకు ఉపాధి కల్పిస్తామని, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఆఫీసుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీరి స్కిల్‌ను బట్టి విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. శంకుస్థాపనలు చేసిన వాటికి మళ్లిd శంకుస్థాపనలు చేయడం తప్ప ముఖ్యమంత్రి జగన్ ఒక్కటైనా పని చేశారా అని చంద్రబాబు ప్రశ్నించారు.
బోగాపురం విమానాశ్రయం, మచిలిపీట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్ రెండోసారి శంకుస్దాపనలు చేశారు, తప్ప ఒక్క అడుగు ముందుకు పడలేదని అన్నారు. నిన్న నంబూరులో హజ్ యాత్రకు వెళ్లే వారికి కలవడానికి ముందుగా తాను షెడ్యూల్ ఇస్తే ..తనకు అనుమతివ్వకుండా అదే షెడ్యూల్ కి సీఎం వెళ్లారని, ఇలాంటి వ్యక్తిని ఏమనాలని, అధికారం ఉందని ఇస్టారుసారంగా వ్యవరించటం సిగ్గుచేటని అన్నారు. టీ-డీపీ హయాంలో రూ.140 కోట్లు- కేటాయించి హజ్ హౌజ్‌కి శంకుస్ధాపన చేశామని, కానీ జగన్ దాన్ని నిర్వీర్యం చేశారని, హజ్ హౌస్ కట్టలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతారంట అని, టీ-డీపీ అధికారంలోకి రాగానే విజయవాడలో దేశంలో ఎక్కడా లేని విధంగా హజ్ హౌస్ నిర్మిస్తామని చెప్పారు.
మంత్రులకు సాక్షి స్రిప్ట్ చదవటం తప్ప సబ్జెక్ట్ తెలియదని, ప్రతి రోజూ తనను తిట్టడమే పనిగా పెట్టు-కున్నారని అన్నారు. అక్రమ మైనింగ్ చేసేవాడు మైనింగ్ మంత్రి అని, సొంతూళ్లో పిల్ల కాల్వ తవ్వలేని వ్యక్తి ఇరిగేషన్ మంత్రి అని, నియోజకవర్గంలో 10 ఇళ్లు కట్టలేని వాడు హౌసింగ్ మంత్రి అని, పెట్టు-బడులు గురించి అడిగితే కోడిగుడ్డు గురించి చెప్పేవాడు పరిశ్రమల మంత్రి అని, జగనుకు కోర్టుల్లో అనూకుల తీర్పులు రావాలని హిందూ దేవాలయాల సొమ్ముతో యాగాలు చేసేవాడు దేవదాయ శాఖ మంత్రని, రైతు బజార్లను తాకట్టు- పెట్టేవాడు ఆర్థిక శాఖ మంత్రని, పిల్లల జీవితాలు నాశనం చేసేవాడు విద్యా మంత్రని, ఇలాంటి మంత్రుల వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి ని, మంత్రుల అసమర్థతను, వైసీపీ వైఫల్యాలను ఐటీ-డీపీ కార్యకర్తలు ప్రజల్లో ఎండగట్టాలని కోరారు.
వచ్చే ఎన్నికలు దోపిడి దారులకు పేదలకు మద్య జరుగుతున్న యుద్ధమని, దోపిడి దారులు దోచుకున్న డబ్బంతా పేదలకు పంచుతామని చెప్పారు. కౌరవ సభను గౌరవ సభగా చేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వచ్చే కురుక్షేత్రంలో కౌరవ వధ జరగాలని చంద్రబాబు అన్నారు.