Tuesday, November 19, 2024

జగన్ ప్రభుత్వం కక్ష సాధిస్తుంది..కోర్టుకు వెళ్లే యోచ‌న‌లో బాబు

రాజధాని అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో తనకు సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని కోర్టులో సవాలు చేయాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేర‌కు సీఐడీ నోటీసుల‌ను స‌వాల్ చేస్తూ కోర్టుకు వెళ్లాల‌ని భావిస్తున్నారు. న్యాయనిపుణులతో చర్చించి.. తదుపరి కార్యాచరణపై ఆయన నిర్ణయం తీసుకోనున్నారు. హైద‌రాబాద్‌లోని నివాసంలో ఆయ‌న్ను క‌లిసేందుకు వచ్చిన పార్టీ నేత‌ల‌తో నోటీసుల‌పై చంద్ర‌బాబు చ‌ర్చించారు. పయ్యావుల కేశవ్‌, కిశోర్‌కుమార్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో కలసినప్పుడు.. సీఐడీ నోటీసుల అశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.

ప్రభుత్వం కావాల‌ని కక్ష సాధిస్తోంద‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. ఇన్నాజ‌ల్లు కార్యకర్తలను ఇబ్బంది పెట్టారన్న చంద్ర‌బాబు… ఇప్పుడు త‌న‌దాకా వచ్చారు మండిప‌డ్డారు. ఏ తప్పూ చేయనప్పుడు నోటీసుల‌కు భయపడాల్సిన అవ‌స‌రం లేద‌ని.. . ధైర్యంగా ఎదుర్కొందామ‌ని పార్టీ నేత‌ల‌తో చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది.

కాగా, చంద్రబాబు నేడు ఏలూరు వెళుతున్నారు. కుమారుడు చనిపోవ‌డంతో దుఃఖంలో మునిగిపోయిన మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించనున్నారు. ఏలూరు నుంచి నేరుగా అమరావతి వెళ్తారు. ఆ త‌ర్వాత సీఐడీ నోటీసుల‌పై న్యాయ నిపుణుల‌తో చ‌ర్చించ‌నున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement