మన్ కీ బాత్ 93వ ఎపిసోడ్ లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. చీతాలు ఇండియా రావడం పట్ల దేశ ప్రజలంతా సంతోషం వ్యక్తం చేశారన్నారు.130 కోట్ల మంది భారతీయులు ఉప్పొంగిపోయారు. ఒక టాస్క్ ఫోర్స్ ఈ చీతాలను పర్యవేక్షిస్తుంది. అది ఇచ్చే రిపోర్టు ఆధారంగా చీతాలను ప్రజలు ఎప్పుడు సందర్శించవచ్చో నిర్ణయిస్తాం’ ప్రధాని మోడీ అన్నారు. కాగా చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 28వ తేదీ అమృత్ మహోత్సవం ప్రత్యేక రోజు అని ప్రధాన అన్నారు. ఆ రోజున మనం భగత్ సింగ్ జీ జయంతిని జరుపుకుంటామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement