చీటింగ్ కేసులో అరెస్టయిన శిల్పా చౌదరికి ఉప్పర పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేసింది. కాగా నేడు చంచల్ గూడ జైలు నుండి ఆమె విడుదలయింది. ఈ ఏడాది నవంబర్ 27న శిల్పా చౌదరిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. దివ్యారెడ్డి కేసులో గతంలోనే ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. పుప్పాలగూడకు చెందిన దివ్యారెడ్డి తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఆ తర్వాత పలువురు వరుసగా శిల్పా చౌదరి ద్వారా తాము మోసపోయినట్టుగా పోలీసులను ఆశ్రయించారు. రోజుకొకరు శిల్పా చౌదరి తమ వద్ద నుండి డబ్బులు తీసుకొని మోసపోయామని ఫిర్యాదులు చేశారు.
కాగా ఈ కేసుకు సంబంధించిన వారెవరిని కూడా కలవకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రతి శనివారం నాడు పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని ఆదేశించింది. పోలీసుల విచారణకు సహకరించాలని కూడా కోర్టు కోరింది. శిల్పా చౌదరిని మూడు దఫాలు నార్సింగి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని విచారించారు. కానీ శిల్పా చౌదరి మాత్రం నోరు మెదపలేదు. మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల్లో శిల్పా చౌదరి పెట్టుబడులు పెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో శిల్పా చౌదరి నోరు మెదపలేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..