ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో పార్టీలన్నీ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు. పంజాబ్ లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికని పూర్తి చేసింది. నేటి సీఈసీ సమావేశం తర్వాత మొదటి జాబితాను విడుదల చేయనుంది. ఇక సీఎం చరణ్ జీత్ సింగ్.. చమ్కౌర్, అదాంపూర్ స్థానాల నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 14న ఈ మూడు రాష్ట్రాలలో పోలింగ్ జరగనుంది. మణిపూర్లో ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు విడతల్లో ఎన్నికల్లో జరగనుండగా, పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఏకంగా ఏడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 403 స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వ తేదీ వరకు ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడవుతాయి. పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ కూడా బరిలోకి దిగింది. అభ్యర్థిని ప్రజలే ఎన్నుకునేలా ఫోన్ ద్వారా ఓటింగ్ చేయొచ్చని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..