డబుల్ ఇంజిన్ సర్కారు, బుల్‌డోజర్ల పాలన అంటూ చాలామంది బీజేపీ లీడర్లు తమ ప్రభుత్వాల తీరును గొప్పగా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అక్కడ అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్న విధానం బాగానే ఉంది.
అయితే.. కొన్ని ప్రాంతాల్లో పెద్దల జోలికి పోకుండా నిరుపేదల ఇళ్లను మాత్రమే కూల్చివేస్తున్నారన్న అపవాదు కూడా వినిపిస్తోంది. దీంతో చాలామంది నెటిజన్లు బీజేపీ ప్రభుత్వాల పాలనను ఆన్‌లైన్‌లో, సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తుంటారు. సోషల్ మీడియా అంటేనే ఎవరి ఇష్టమున్నట్టు వారు రాసుకోవడం, వ్యక్తిగత స్వేచ్ఛ వంటివి ఎక్కువగా ఉంటాయి.
ఇక.. దేశ సరిహద్దుల్లో.. ఇండియా, చైనా బోర్డర్‌లో చైనా చేస్తున్న అక్రమాలు, ఆక్రమణలు.. అక్రమ కట్టడాలు, బిల్డింగులు, బ్రిడ్జిలను చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలనను దెప్పి పొడుస్తున్నారు నెటిజన్లు. మీ బుల్డోజర్లు ఇక్కడ కాదు.. అక్కడికి పంపాలే అని హేళనగా వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. ఇట్లాంటి వాటిలో మచ్చుకు ఒక ట్వీట్‌ను ఇక్కడ ఇస్తున్నాం.. ఈ ట్వీట్‌లో ఆగస్టు 2019లో ఉన్న పరిస్థితులు.. నవంబర్ 2020లో పరిస్థితులు, అక్కడ చేపట్టిన కట్టడాలు, నిర్మాణాలను చూపుతూ ఓ ఫొటో ట్వీట్ చేశారు.
ఈ పరిస్థితి 2022కి మరింత దారుణంగా తయారైంది. ఏకంగా పాంగాంగ్ సరస్సుపై బ్రిడ్జిలను నిర్మించింది చైనా. అంతేకాకుండా సరిహద్దుల్లో యుద్ధ విమానాలు ఈజీగా ఫ్లై కావడానికి ఎయిర్ బేస్‌లను కూడా నిర్మిస్తోంది. మరి బీజేపీ బుల్డోజర్లు అక్కడ కూల్చివేతలు చేపడితే భారత ప్రజలు సంతోషిస్తారు. అంటున్నారు నెటిజన్లు..