క్వాడ్ కూటమి డ్రామన్ కంట్రీ చైనా అగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు క్వాడ్ కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాము క్వాడ్ కూటమిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. లేని సమస్యలను సృష్టించకూడదని హితవు పలికింది. శాంతి, సుస్థిరతకు సహకరించాలంటూ చైనా రక్షణ శాఖ పేర్కొంది. క్వాడ్ సమావేశంలో తాము చైనా విసురుతున్న సవాళ్లపై చర్చించినట్లు అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సల్లివాన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన చైనా ఇలా స్పందించింది. ఇండో, పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరత కోసం తాము ప్రయత్నిస్తామని ఈ మధ్యే జరిగిన తొలి క్వాడ్ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పిన విషయం తెలిసిందే. అమెరికా ప్రమోట్ చేస్తున్న ఈ క్వాడ్ వాళ్ల కోల్డ్ వార్ మనస్తత్వానికి అద్దం పడుతోందని చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ రెన్ గువోకియాంగ్ విమర్శించారు. ఇది ఒక జట్టుగా ఘర్షణకు దిగడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికాది కోల్డ్ వార్ ధోరణి: చైనా
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement