ప్రపంచానికి కొరకరాని కొయ్య చైనా కి భారీగా అప్పులు ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నాటికి చైనా అప్పులు 2.3 లక్షల కోట్ల డాలర్లని (రూ.1.67 కోట్ల కోట్లు) ప్రభుత్వానికి చెందిన మేధో సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది అవి మరింత పెరిగే అవకాశముందని అంటోంది. దీంతో అభివృద్ధి పేరిట స్థానిక ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా రుణాలు తీసుకునేందుకు కమ్యూనిస్ట్ పార్టీ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. కరోనా మహమ్మారి సమయంలోనూ బడ్జెట్ కు మించి స్థానిక ప్రభుత్వాలు అప్పులు చేశాయని, దీంతో ఆ అప్పులు 6 శాతం పెరిగాయని ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ పైనాన్స్ అండ్ డెవలప్ మెంట్ కు చెందిన ఆర్థిక పరిశోధకుడు లూ లీ అన్నారు.
అయితే ఈ అప్పులను చైనా దాచి పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. స్థానిక ప్రభుత్వాలు బాండ్ల ద్వారా తీసుకున్న రుణాలు, ప్రభుత్వ రుణ సంస్థలు, ఇన్సూరెన్స్ సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలనే అప్పుల్లో లెక్క గట్టింది. అయితే, బ్యాంకు లోన్లను మాత్రం ఈ గణాంకాల్లో చేర్చలేదు. వాణిజ్య ప్రాజెక్టులకే ఎక్కువగా బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటారన్న కారణంతో వాటిని కలపలేదు. వాటినీ కలిపితే అప్పు మరింత ఎక్కువగా ఉండే అవకాశముంది