Saturday, November 23, 2024

విశాఖ ఉక్కు ఉద్యమానికి ఏడాది – క‌రోనాతో 150మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మృతి

విశాఖ స్టీల్ ప్లాంట్ పై క‌రోనా పంజా విసిరింది. దాంతో ఇప్ప‌టి వ‌ర‌కు 150మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మ‌ర‌ణించారు. కాగా విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ పోరాట స‌మితి చైర్మ‌న్ సిహెచ్ న‌ర‌సింగ‌రావు ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించారు. తాజాగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటి కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఒక్క రోజు కూడా విరామం ఇవ్వకుండా నిరసన దీక్షలు చేశామని.. ఈ పరిస్థితి లో కూడా 700 కోట్లు లాభాలు వచ్చాయని వెల్లడించారు. వచ్చే నెల 12 తో ఏడాది అవుతుందని.. 365 జెండాలను పట్టుకుని నిరసన ప్రదర్శన చేపడతామన్నారు. వచ్చే నెల 13న ఉద్యమం ఏడాది పూర్తియిన సందర్భంగా బీజేపీ కార్యాలయం ముట్టడి ఉంటుందని ప్రకటన చేశారు. ఫిబ్రవరి 23 న విశాఖ నగరం తో పాటు..రాష్ట్ర బంద్, ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు కోటి సంతకాల సేకరణ ఉంటుందని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement