కేంద్ర కేబినెట్ విస్తరణకు కసరత్తు ఇంకా కొనసాగుతోంది. ఇదే అంశంపై చర్చించేందుకు ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ తన నివాసంలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా సహా మరికొందరు మంత్రులు భేటీ కానున్నారు. కేంద్ర కేబినెట్‌లోకి కనీసం 18 మంది కొత్త మంత్రులను చేర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మంత్రిత్వశాఖలతో పాటు సరిగా పని చేయని మంత్రుల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఇప్పటికే పలుసార్లు మంత్రిత్వశాఖల పనితీరుపై ప్రధాని సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరుగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేబినెట్ విసర్తణ జరిగే అవకాశం ఉన్నది. కేంద్ర మంత్రివర్గాన్ని బుధవారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ ప్రధాన కార్యదర్శి (సంస్థ) బీఎల్ సంతోష్‌తో బీఎల్ సంతోష్‌తో ప్రధానికి సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేబినెట్ కూర్పుపై చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇవాళ ప్రధాని కేంద్ర మంత్రులతో మరోసారి భేటీ నిర్వహిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: ‘వాహనమిత్ర’కు దేవదాయ నిధులు మళ్లించలేదు: ఏపీ హై కోర్టు